: గుడ్ న్యూస్!... నవ్యాంధ్ర రాజధానికి రూ.5 వేల కోట్ల ప్రపంచబ్యాంకు రుణం


ఏపీ ప్రభుత్వానికి నిన్న ఓ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర విభజన తర్వాత కనీస వసతులు కలిగిన రాజధాని కూడా లేకుండా 13 జిల్లాలతో కూడిన ఓ ముక్కగా ఏర్పడ్డ నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని తక్షణావసరంగా మారింది. ఇందుకోసం ఇతోధికంగా నిధులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు అందుకున్న ప్రపంచ బ్యాంకు... రుణమిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలి విడతగా రూ.5 వేల కోట్ల రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ రుణం చెల్లింపునకు దీర్ఘకాల పరిమితి ఉన్న నేపథ్యంలో దానిని స్వీకరించేందుకు చంద్రబాబు సర్కారు కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితం ఏపీకి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలోని పరిస్థితులపై సమగ్ర పరిశీలన జరిపారు. అధికారులతో కీలక చర్చలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రుణాన్ని అందించేందుకు ఆ బ్యాంకు నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. ఈ రుణ చెల్లింపునకు 30 నుంచి 40 ఏళ్ల కాలపరిమితి ఉండటంతో రుణం తీసుకునేందుకు ప్రభుత్వం కూడా మొగ్గుచూపుతోంది.

  • Loading...

More Telugu News