: పంజా విసిరిన మావోలు!... ఛత్తీస్ గఢ్ లో ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం... మావోయిస్టుల సంచారం, పోలీసుల కూంబింగ్, ఇరు వర్గాల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. మొన్నటికి మొన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది దళ సభ్యులను హతమార్చి మావోలను భారీ దెబ్బ తీసిన భద్రతా దళాలు... తాజాగా ఎదురు దెబ్బతిన్నాయి. మొన్న జరిగిన దాడికి ప్రతీకారంగా నిన్న రాత్రి ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోలు విరుచుకుపడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా మెరుపు దాడికి దిగిన మావోలు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో మరో 14 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య భీకర స్థాయిలో కాల్పులు కొనసాగుతున్నాయి.