: రాబిన్ ఊతప్ప ఓ ఇంటివాడయ్యాడు!... ధావల్ కులకర్ణి కూడా!


భారత క్రికెట్ లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇప్పటికే హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ పెళ్లిళ్లు చేసుకోగా, యువరాజ్ సింగ్ కి ఎంగేజ్ మెంట్ అయింది. తాజాగా భారత జట్టులో కీలక బ్యాట్స్ మన్ గా కొనసాగిన రాబిన్ ఊతప్ప కూడా పెళ్లి చేసుకున్నాడు. టెన్నిస్ క్రీడాకారిణిగా క్రీడా ప్రపంచంలో బాగానే ప్రాచుర్యం పొందిన షీతల్ గౌతమ్ ను ఊతప్ప నిన్న పెళ్లి చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఊతప్ప సహచర క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో పాటు బాలీవుడ్ నటి జుహి చావ్లా హాజరయ్యారు. ఇదిలా ఉంటే, టీమిండియా జట్టులో స్వల్పకాలం పాటు కొనసాగి, ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న ధావల్ కులకర్ణి కూడా నిన్న పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాషన్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న శ్రద్ధ కర్పూడేను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా కులకర్ణికి శుభాకాంక్షలు తెలిపాడు.

  • Loading...

More Telugu News