: తప్పుడు రాతలపై చర్యలు తీసుకుంటాము: సీఎం చంద్రబాబు
తప్పుడు రాతలు రాసే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల భూదందాపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాసిన వార్తలను కచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పత్రికకు ఉందన్నారు. సొంత అజెండాతో ఏపీ పరువు తీయాలని ప్రతిపక్షం ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తమపై నమ్మకంతోనే రైతులు భూములు ఇచ్చారని, అమరావతిపై ఆ పత్రిక విషం చిమ్ముతోందని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ప్రజల డబ్బుతోనే వారు పత్రిక పెట్టారని, రాష్ట్రానికి నష్టం చేసే విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.