: 2018 నాటికి పోలవరం తొలి దశ పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు


2018 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి విడత పనులు పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని, తమ హయాంలో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామని, నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీకి వంద పంటకుంటలు తవ్వాలని, ఈ మూడున్నర నెలల్లో వాటిని తవ్వితే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News