: నేను అబద్ధమాడను.. కావాలంటే, నా పిల్లలమీద ప్రమాణం చేస్తాను: మురళీమోహన్


విజయవాడ కనకదుర్గమ్మ వారధికి సమీపంలోని కుంచనపల్లిలో ఉన్న ఏడు ఎకరాల భూమి మినహా ఎటువంటి భూములు తన పేరు మీద కానీ, బినామీల పేరు మీద కానీ లేవని మురళీమోహన్ అన్నారు. కావాలంటే, తాను వ్యాపారం చేసే భూమి మీద, తన తల్లిదండ్రుల మీద, పిల్లల మీద ప్రమాణం చేస్తానంటూ మురళీమోహన్ ఉద్వేగంగా మాట్లాడారు. ఏదైనా కొనుగోలు చేస్తే ధైర్యంగా చెప్పుకుంటాను గానీ, భయపడాల్సిన పని తనకు లేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నూటికి నూరుపాళ్లు దురుద్దేశంతో కూడుకున్నవేనని అన్నారు. తనను ఇంత మనస్తాపానికి గురి చేసిన వారిపై కోర్టు ద్వారా ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నానని, తన కొడుకు, తమ్ముడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, వాళ్లు వచ్చిన తర్వాత సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాత బయటకు ప్రకటిస్తానని మురళీమోహన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News