: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి క్రమబద్ధీకరణ రుసుం రద్దు
భవనాల క్రమబద్ధీకరణ రుసుం నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి మినహాయింపు లభించింది. క్యాన్సర్ ఆసుపత్రి చెల్లించాల్సిన రూ.5.72 కోట్ల రుసుంను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ ను ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ కలిసిన సందర్భంలో వారి మధ్య ఆసుపత్రి గురించి కొంత చర్చ జరిగింది. క్యాన్సర్ ఆసుపత్రికి చేయూత నందిస్తామని కేసీఆర్ బాలకృష్ణకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.