: పుతిన్ కు పట్టం కట్టేందుకు 74 శాతం మంది అనుకూలం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఆ దేశంలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. రెండు సార్లు అధ్యక్షపదవి చేపట్టిన పుతిన్ మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేస్తే అతనినే ఎన్నుకుంటామని రష్యాలో మెజారిటీ వర్గం ప్రజలు పేర్కొంటున్నారు. 2018లో రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే 74 శాతం మంది ప్రజలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని తెలిపారని ప్రభుత్వ పోలింగ్ ఏజెన్సీ పోల్ స్టర్ బీటీఎస్ఐఓఎం తెలిపింది. రష్యన్ ఆధిపత్యాన్ని తిరిగి నిలబెట్టడంలో పుతిన్ సఫలీకృతులయ్యారని అక్కడి ప్రజలు భావిస్తున్నారని పోలింగ్ ఏజెన్సీ వెల్లడించింది.