: చలించిన చంద్రబాబు... కిడ్నీ బాధితుడికి రూ.4 లక్షల సాయం
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఒక యువకుడికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4లక్షల సాయాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వీరవల్లిపాలెంకు చెందిన మణికంఠ అనే యువకుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈరోజు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అతను తన గోడును చంద్రబాబుకు వెళ్లబోసుకున్నాడు. దీనికి చలించిన చంద్రబాబు వెంటనే సీఏం సహాయనిధి నుంచి 4 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. కాగా, బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన త్రివేణి అనే మహిళకు రూ.లక్ష సాయాన్ని కూడా సీఎం అందించారు.