: అద్దె చెల్లించలేక రింగింగ్ బెల్స్ కార్యాలయం మూత


251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ దేశంలో కలకలం రేపిన రింగింగ్ బెల్స్ కార్యాలయం నేడు మూతపడింది. అద్దెచెల్లించని కారణంగా ఈ కార్యాలయం మూత పడినట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై ఆ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాట్లాడుతూ, తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఎక్కడికీ పారిపోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫ్రీడమ్ 251 ఫోన్ విషయంలో రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ ను ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మొబైల్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న కస్టమర్ల సొమ్ము విషయంలో ఈడీ పలు ప్రశ్నలు సంధించింది. కాగా, దిగ్గజ మొబైల్ సంస్థలకు సాధ్యం కాని రీతిలో కేవలం 251 రూపాయలకే రింగింగ్ బెల్స్ ఫోన్ అందజేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News