: భూ దందాపై పవన్ కల్యాణ్ పోరాడాలి: ఎమ్మెల్యే రోజా


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ నేతల భూదందాపై జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పోరాడాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా కోరారు. ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ ఈ వ్యవహారంపై నోరుమెదపాలని అన్నారు. గత ఎన్నికల్లో పవన్ ను చూసే ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రెవెన్యూ మంత్రిని తప్పించి మంత్రులు పుల్లారావు, నారాయణలకు ఎందుకు బాధ్యతలు అప్పగించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. భూదందా చేయకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో సంబంధిత రికార్డులు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. నారాయణ కాలేజీ సిబ్బంది మాత్రమే రాజధాని ప్రాంతంలో భూములు ఎలా కొన్నారని, మిగతా కాలేజీ సిబ్బంది ఎందుకు కొనలేకపోయారో చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ నాయనమ్మ అమ్మణమ్మ గురించి కూడా రోజా ప్రస్తావించారు. కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్న అమ్మణమ్మ, తన మనవడు లోకేశ్ కు శేరిలింగంపల్లిలో ఐదు ఎకరాల భూమి ఎలా ఇచ్చిందని రోజా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News