: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల వయోపరిమితి పెంపు


తెలంగాణ పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి వయోపరిమితిని ఒక ఏడాది పాటు పెంచుతున్నట్టు తెలంగాణ పోలీసు నియామక సంస్థ జారీ చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్లో తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూలై 1 నాటికి ఎస్సై అభ్యర్థులకు 29 ఏళ్లు, కానిస్టేబుళ్లకు 26 ఏళ్ల గరిష్ఠ వయసును నిర్ణయించినట్టు తెలిపింది. పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు మార్చి 15, ఎస్సై ఉగ్యోగాలకు మార్చి 10 వరకు చివరి తేదీ అని పోలీస్ శాఖ తెలియజేసింది.

  • Loading...

More Telugu News