: జాకీచాన్ ఈసారి భారతీయ నటికి బహుమతి ఇచ్చాడు


ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ తనకు నచ్చిన వారికి బహుమతులు ఇస్తుంటాడు. గతంలో సోనూ సూద్ కు జాకెట్ బహుమతిగా ఇచ్చిన జాకీ, ఈసారి భారతీయ నటి అమీరా దస్తర్ కు మరో జాకెట్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ తరహా జాకెట్లను జాకీచాన్ స్టంట్ బృందం మాత్రమే ధరిస్తుంది. ఈ ప్రత్యేకమైన బహుమతి అందుకున్న అమీరా దస్తర్ దానిని ధరించి తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో వున్న 'కుంగ్ పూ యోగా' సినిమాలో జాకీచాన్ సరసన అమీరా దస్తర్ నటిస్తోంది. ఈ సినిమాలో సోనూ సూద్, ఆరిఫ్ రెహమాన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News