: తండ్రిని ఆకాశానికెత్తేసిన కేటీఆర్... అభివృద్ధి ఒక్క కేసీఆర్ కే సాధ్యమని కామెంట్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన కొడుకు, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆకాశానికెత్తేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి ఉదయం ఖమ్మం వెళ్లిన కేటీఆర్... అక్కడ రోడ్ షో నిర్వహించారు. అభివృద్ధి కావాలనుకుంటే టీఆర్ఎస్ కు ఓటేయాలని ఆయన ఖమ్మం ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన తండ్రికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అభివృద్ధి ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. తెలంగాణలో మరెవరికీ అది సాధ్యం కాదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.