: టీడీపీ నేతలూ.. న్యాయవిచారణకు సిద్ధపడండి: రోజా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భూ దందాలకు పాల్పడిన టీడీపీ నేతలు తమ తప్పు లేదని నిరూపించుకోవాలని, న్యాయవిచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణను ఎదుర్కొని, నిజాయతీపరులని నిరూపించుకోవాలని ఆమె కోరారు. అంతేకానీ, వెబ్ సైట్ లో ఉన్న ఆధారాలన్నీ మాయం చేసి, సాక్షి పత్రికపై కేసులు పెడతామని, మూయిస్తామని భయపెడితే బెదరమని, టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని రోజా అన్నారు.