: అహంకారమంటే చంద్రబాబు నాయుడిదే: రోజా
అహంకారమంటే చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరైనా ఎస్సీల్లో పుడతారా?, ‘నాతో పెట్టుకుంటే ఎవడైనా ఫినిష్’ అంటూ అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబును చూస్తే ఎంత అహంకారో అర్థమవుతుందన్నారు. 'ఎంతో అనుభవమున్న చంద్రబాబు మమ్మల్ని ఓపిగ్గా ఉండమంటారు, కానీ, ఇంత వయస్సు వచ్చిన ఆయన మాత్రం ఓపికతో వ్యవహరించరు. మా పార్టీ నేతలను బజారు రౌడీలని, మా పార్టీని సైకో పార్టీ అని..అంతుచూస్తామని మాట్లాడిన చంద్రబాబు అహంకారా? లేక జగనా?' అని రోజా ఘాటుగా ప్రశ్నించారు.