: త్రాల్ లో ఎన్ కౌంటర్... ముగ్గురు హిజ్బుల్ ముష్కరుల హతం


జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట పడటం లేదు. రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పరిధిలోని త్రాల్ లో నిన్న రాత్రి దేశంలోకి చొచ్చుకువచ్చేందుకు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వేగంగా స్పందించింది. ముష్కరులపై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది హిజ్బుల్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న అనుమానంతో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఎన్ కౌంటర్ తో త్రాల్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News