: రాజీవ్ హంతకులకు రిలీఫ్?...అభిప్రాయం చెప్పాలంటూ కేంద్రానికి జయ సర్కారు లేఖ


తమిళనాడు ప్రభుత్వం నిన్న మరో సంచలనానికి తెరలేపింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలిన ఏడుగురు ఎల్టీటీఈ ఉగ్రవాదులకు యావజ్జీవ శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే 24 ఏళ్లుగా వారు జైల్లోనే మగ్గుతున్నారంటూ తమిళనాడులోని జయలలిత సర్కారు... యూపీఏ హయాంలోనే వారిపై కాస్తంత దయ చూపింది. అయితే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాటి మన్మోహన్ సింగ్ సర్కారు... జయలలిత ప్రభుత్వ నిర్ణయానికి చెక్ పట్టింది. తాజాగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో జయలలిత సర్కారు ఈ అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చింది. ‘‘24 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్న రాజీవ్ హంతకులను విడుదల చేయడానికే నిర్ణయించుకున్నాం, దీనిపై మీరేమంటారు?’’ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ మేరకు నిన్న తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News