: ‘అమ్మ’ కేబినెట్ నుంచి మరో తెలుగు మంత్రికి ఉద్వాసన... పది రోజుల్లో ఇద్దరు ఔట్


తమిళ నాట తెలుగు భాష ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఆ రాష్ట్ర సర్కారీ పాఠశాలల్లో తమిళ భాషను తప్పనిసరి చేసిన జయలలిత సర్కారు ఇతర ప్రాంతీయ భాషలపై కత్తి దూశారు. ఈ పరిణామం ఇతర భాషలపై ఏ మేర ప్రభావం చూపిందో తెలియదు కానీ, తెలుగు భాషపై పెను ప్రభావమే చూపింది. తాజాగా తెలుగు మూలాలున్న మంత్రులపైనా జయలలిత వరుసగా వేటు వేస్తున్నారు. గత నెల 20న పాడి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తెలుగు నేత బీవీ రమణను జయ తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. తాజాగా నిన్న పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న టీకేఎం చిన్నయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. జయ సర్కారు ప్రతిపాదన మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య చిన్నయ్యను కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదంటే పది రోజుల్లో ఇద్దరు తెలుగు మంత్రులు జయ కేబినెట్ నుంచి బర్తరఫ్ కావడంపై తమిళనాడులోని తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News