: సికింద్రాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య... వాకింగ్ కు వెళ్లి వస్తుండగా దుండగుల మెరుపు దాడి


సికింద్రాబాదులో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగివస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ జైన్ పై గుర్తు తెలియని దుండగులు మెరుపు దాడికి దిగారు. హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్న జైన్ సికింద్రాబాదులో ఉంటున్నారు. నేటి ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న జైన్ పై స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద దుండగులు దాడి చేశారు. కత్తులు చేతబట్టి దుండగులు విరుచుకుపడటంతో తీవ్ర గాయాలైన జైన్ అక్కడే రక్తపు మడుగులో పడిపోయారు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాదులోని ప్రధాన రహదారిపై జరిగిన ఈ దాడి అక్కడ కలకలం రేపింది. అక్కడి స్థానికులు స్పందించేలోగానే దుండగులు పరారయ్యారు.

  • Loading...

More Telugu News