: మాల్యాకు షాకిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!... లిక్కర్ కింగ్ ను అరెస్ట్ చేయాలని పిటిషన్


వ్యాపారాల పేరిట పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని డిఫాల్టర్ గా తేలిన యునైటెడ్ బ్రూవరీస్ ప్రమోటర్ విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోతున్నారు. ఇటీవలే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను డియాజియోకు విక్రయించేసిన మాల్యా, ఆ కంపెనీ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేందుకు రూ.515 కోట్లను బహుమానంగా అందుకుంటున్నారు. ఇక మాల్యా లండన్ ఫ్లైటెక్కడమే ఆలస్యమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాల్యా సంస్థలకు భారీ ఎత్తున రుణాలిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేల్కొంది. తన వద్ద రుణాలు తీసుకుని, వాటిని ఎగవేసి విదేశాలకు పారిపోతున్న మాల్యాను అరెస్ట్ చేయాలని ఆ బ్యాంకు నిన్న డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది. ఈ మేరకు బెంగళూరులోని డీఆర్టీలో ఎస్బీఐ మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్బీఐ నేతృత్వంలోని పలు బ్యాంకులు... మాల్యా ఆధ్వర్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు రూ.7,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. వీటిని తీర్చడంలో విఫలమైన మాల్యాను ఇప్పటికే బ్యాంకులు ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్ ఫుల్ డిఫాల్టర్)’ గా ప్రకటించాయి. మాల్యా లండన్ లో స్థిరపడనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎస్బీఐ ఈ పిటిషన్లను దాఖలు చేసింది. మాల్యా పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని, డియాజియా నుండి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపరచడంతో పాటు విదేశాల్లోని మాల్యా ఆస్తుల వివరాలన్నిటినీ వెల్లడయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ఎస్బీఐ తన పిటిషన్లలో కోరింది.

  • Loading...

More Telugu News