: రామోజీరావుకు పద్మ విభూషణ్ ఎలా ఇస్తారు?... హైకోర్టులో ఉండవల్లి పిల్


మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో ఏళ్ల తరబడి న్యాయ పోరాటం సాగించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దన్నుతో రామోజీరావును కోర్టు మెట్లెక్కించేందుకు ఉండవల్లి చేయని ప్రయత్నం లేదు. తాజాగా ఉండవల్లి మరోమారు రామోజీరావును కోర్టుకు ఈడ్చేందుకు రంగంలోకి దిగారు. ఈ దఫా ‘పద్మ విభూషణ అవార్డు’ను ఆసరా చేసుకున్న ఆయన నిన్న ఏకంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఉండవల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఎప్పుడు విచారణ జరగనుందన్న విషయం ఇంకా తేలలేదు.

  • Loading...

More Telugu News