: మున్నాభాయ్ కు ఎన్డీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ గా ఆహ్వానం
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు తమ ప్రచారకర్తగా వుండాలని ఎన్డీఎంసీ కోరింది. ఈ విషయమై ఎన్డీఎంసీ చైర్మన్ నరేష్ కుమార్ ను వివరణ కోరగా... యువతలో సంజయ్ దత్ కు ఆకర్షణ ఉండటంతో పాటు ఆయనకు ఉన్న సామాజిక దృక్పథం నేపథ్యంలోనే ఆయనకు ఈ ఆహ్వానం పంపామన్నారు.