: రాణించిన సర్ఫరాజ్, షోయబ్...తడబడి నిలబడిన పాక్


ఆసియాకప్ లో భాగంగా ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ తడబడి నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ కు హొస్సైన్ షాకిచ్చాడు. ఓపెనర్ ఖుర్రం మంజూర్ (1)ను రెండో బంతికే పెవిలియన్ కు పంపాడు. అనంతరం మరో ఓపెనర్ షెర్జిల్ ఖాన్ (10)ను సన్నీ పెవిలియన్ బాటపట్టించాడు. కాసేపట్లోనే హఫీజ్ (2)ను మొర్తజా అవుట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ అహ్మద్ (58) రాణించాడు. సహచరులు వెనుదిరుగుతున్నా ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. దీంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని నాటౌట్ గా నిలిచాడు. ఉమర్ అక్మల్ (4) మరోసారి నిరాశపరచడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన షోయబ్ మాలిక్ (41) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కష్టాల్లో ఉన్న పాక్ ను మాలిక్, అహ్మద్ ల 70 పరుగుల భాగస్వామ్యం జట్టుకు పోరాడదగ్గ స్కోరును అందించింది. అనంతరం వచ్చిన కెప్టెన్ అఫ్రిదీ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. చివర్లో వచ్చిన అన్వర్ అలీ (13) భారీ షాట్లకు ప్రయత్నించినా సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో చివరి బంతికి అవుటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ అమీన్ హొసైన్ మూడు వికెట్లతో రాణించగా, అతనికి రెండు వికెట్లతో అరాఫత్ సన్నీ, చెరో వికెట్ తో అహ్మద్, మొర్తజా చక్కని సహకారమందించారు. 130 పరుగుల విజయ లక్ష్యంతో ఆతిథ్య బంగ్లాదేశ్ కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది. పాక్ బౌలింగ్ వనరులు బలంగా ఉండడంతో మ్యాచ్ పై ఉత్కంఠ రేగుతోంది. కాగా మ్యాచ్ వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం చేరుకున్నారు.

  • Loading...

More Telugu News