: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న జగన్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్


ఏపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరి ఆస్తులు ఎంతనే విషయమై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, జగన్ కూడా అందుకు సిద్ధమేనా? అని ఆయన సవాల్ విసిరారు. తన పార్టీ ఎమ్మెల్యేలు తనను వీడిపోతున్నందునే జగన్ ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. తన ఆస్తుల విషయమై ప్రకటన చేసే ధైర్యం లేని జగన్, సొంత మీడియాలో తమపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఇప్పటి వరకు ఏడుసార్లు బహిరంగంగా ఆస్తులు ప్రకటించిందన్నారు. వాటి కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే వాటిని వారికే ఇచ్చేస్తామని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News