: ఇకపై వాట్సాప్ లో డాక్యుమెంట్లు కూడా పంపుకోవచ్చు!

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల వాట్సాప్ వెర్షన్ లలో కొత్త ఫీచర్ ఒకటి అదనంగా చేరింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ చాట్ లో డాక్యుమెంట్లు కూడా పంపించుకోవచ్చు. వాట్సాప్ డాక్యుమెంట్ షేరింగ్ తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా అప్ డేటెడ్ వెర్షన్ లలో ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్ చేరిన ఆండ్రాయిడ్ వీ2.12.453, ఐఓఎస్ వీ2.12.4 వెర్షన్లను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా, ఇన్నాళ్లూ వాట్సాప్ వినియోగదారులు ఫొటోలు, ఆడియో, వీడియో ఫైల్స్ ను మాత్రమే పంపించుకునేవారు. తాజాగా, డాక్యుమెంట్లు కూడా పంపించుకునే ఫీచర్ అందుబాటులోకి రావడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News