: 70 లక్షల వాచ్ ను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన సీఎం
గత రెండు వారాలుగా కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన 70 లక్షల రూపాయల వాచ్ కథ కంచికి చేరింది. ఇంత ఖరీదైన వాచ్ ను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదానికి ముగింపు పలికారు. ఈ మేరకు ఆ వాచ్ ను అసెంబ్లీ స్పీకర్ కు అందజేశారు. కాగా, సిద్దరామయ్య అవినీతికి పాల్పడి 70 లక్షల రూపాయల ఖరీదైన వాచ్ ను కొనుగోలు చేశారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. దానికి సమాధానమిస్తూ ఆ వాచ్ ను తన స్నేహితుడు గిఫ్టుగా ఇచ్చాడని తెలిపారు. అయినప్పటికీ విమర్శల వాన తగ్గించని విపక్షాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో వాచ్ వ్యవహారంపై సీఎంను నిలదీశాయి. దీంతో వివాదానికి ముగింపు పలకాలని భావించిన సిద్దరామయ్య దానిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు.