: ట్రంప్ ను ఓడించేందుకు నేనే సరైన వ్యక్తిని: 'రిపబ్లికన్' టెడ్ క్రూజ్
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను ఓడించేందుకు తానే సరైన వ్యక్తినని మరో రిపబ్లికన్ టెడ్ క్రూజ్ తెలిపారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం పార్టీల అభ్యర్థుల మధ్య ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టెడ్ క్రూజ్ మాట్లాడుతూ, రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ ను దాటగల వ్యక్తిని తానేనని అన్నారు. తమ పార్టీలోని ఇతర నేతలకు అండగా నిలిచేవారంతా ఏకతాటిపైకి వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ట్రంప్ ను అధిగమించేందుకు ఇదొక్కటే సరైన మార్గమని ఆయన చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఏడు చోట్ల ప్రైమరీ ఎన్నికలు జరగగా టెడ్ క్రూజ్ రెండు చోట్ల విజయం సాధించారు.