: పరువుగల మా నాన్నను బజారుకీడుస్తున్నారు... షారూఖ్ కి గ్యాంగ్ స్టర్ తనయుడి నోటీసులు


1990ల్లో గుజరాత్ లో మద్యనిషేధం అమల్లో ఉండగా అక్రమ మద్యం వ్యాపారం చేసిన గ్యాంగ్ స్టర్ అబ్దుల్ లతీఫ్ కథ ఆధారంగా, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో 'రయీస్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ లతీఫ్ గా షారూఖ్ కనిపించనున్నాడు. దీనిపై లతీఫ్ కుమారుడు ముస్తాక్ అహ్మద్ అబ్దుల్ లతీఫ్...షారూఖ్, నిర్మాత రితేష్ సిధ్వానీ, దర్శకుడు రాహుల్ ఢొలాకియా కు నోటీసులు పంపాడు. తన తండ్రి సమాజంలో గౌరవం కలిగిన వ్యాపారవేత్త అని, ఆయన పరువును మంటగలిపే విధంగా 'రయీస్' సినిమాను నిర్మిస్తున్నారని, తక్షణం దీనిని ఆపివేయాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 'రయీస్' పేరుతో ప్రచారం, ప్రకటనలు, చిత్రాలు ఏవీ ప్రచురించకూడదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News