: ఆ ఇంటిని చూస్తేనే భయమేస్తోంది: థానే ప్రజలు


మహారాష్ట్రలోని థానేలో ఆదివారం ఓ ఇంట్లో తన రక్త సంబంధీకులపై దాడికి దిగి, 14 మందిని అత్యంత పాశవికంగా హతమార్చిన వ్యక్తి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ నివాసాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇది జరిగి మూడు రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఆ ఇంటిని చూసేందుకు సైతం స్థానికులకు ధైర్యం సరిపోవడం లేదు. అప్పుడే ఈ ఇంటిపై పలు పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఆ ఇంట్లోంచి ఇంకా రక్తపు వాసనవస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. దీంతో చీకటి పడుతోందంటే చాలు, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లు తలుపులు బిడాయించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఒంటరిగా తిరగాలంటేనే భయపడిపోతున్నారు. కాగా, ఈ ఘటనలో బ్రతికి బయటపడ్డ మహిళ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని సమాచారం.

  • Loading...

More Telugu News