: కోహ్లీకి అనుష్క ఫోన్ చేసిందట!


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమాయణం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'సుల్తాన్' లో నటించొద్దని కోహ్లీ చెప్పినప్పటికీ, అనుష్క అతని మాటను పట్టించుకోకపోవడంతో, వారిద్దరి మధ్య మాటామాట పెరిగి విడిపోయారంటూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అనుష్క శర్మ సోదరుడు రంగంలోకి దిగి, మళ్లీ వారిద్దరినీ కలిపే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయానికి బాటలు వేసిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపిందని సమాచారం. దీంతో మొత్తానికి ఇటీవల కోహ్లీ పాడిన 'జో వాదా కియా వో నిభానా పడేగా (ప్రమాణం చేస్తే నిలబెట్టుకుని తీరాలి)' పాట ఆమెపై పని చేస్తున్నట్టే కనపడుతోంది.

  • Loading...

More Telugu News