: కేసీఆర్ కు ఫడ్నవీస్ ఫోన్!... సాగునీటి వాటాలపై చర్చకు ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సాగునీటి వాటాలకు సంబంధించి చర్చించుకుందాం రమ్మంటూ ఫడ్నవీస్ చేసిన ప్రతిపాదనకు కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నెల 7న ముంబై రావాలన్న ఫడ్నవీస్ ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ అదే రోజు ఫ్లైట్ ఎక్కనున్నారు.