: ఆర్ఎస్సై ఆత్మహత్యాయత్నం... పీటీసీ ప్రిన్సిపల్ వేధింపులే కారణమట!
చిత్తూరు జిల్లా తిరుపతిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) లో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. పీటీసీలో రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఆర్ఎస్సై)గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరాం ఆత్మహత్యాయత్నం చేశారు. రోజు మాదిరిగానే నేటి ఉదయం విధులకు హాజరైన తులసీరాం ఉన్నట్టుండి పీటీసీలోనే పురుగుల మందు తాగేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. దీంతో సహచర సిబ్బంది ఆయనను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పీటీసీ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారి వీరభద్రుడి వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరానికి చెందిన తులసీరాం 2002లో ఎస్సై గా సెలెక్ట్ అయ్యారు.