: క్యూలో చాలా మంది ఉన్నారు: శిల్పా చక్రపాణిరెడ్డి


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయే రోజు దగ్గర్లోనే ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారని వ్యాఖ్యానించిన ఆయన, తమ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వారంతా వస్తున్నారని, తామేమీ ప్రలోభాలు పెట్టడం లేదని అన్నారు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకూ విపక్షంలో ఉండి, ఇప్పుడు అధికార పక్షం వైపు చేరుతున్న వారందరినీ కలుపుకొని పోతామని, తమ మధ్య వర్గ విభేదాలు లేవని అన్నారు. సమన్వయంతో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, పాత, కొత్తవారు కలసి పార్టీకి అఖండ విజయం చేకూర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News