: అమరావతిలో దేవినేని ఉమా భూములు కొన్నారన్న వైసీపీ... అవాస్తవమన్న ఏపీ మంత్రి


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భారీ ఎత్తున భూములు కొన్నారని నిన్న విపక్షం వైసీపీ ఆరోపించింది. దీనిపై ఘాటుగా స్పందించిన ఉమా కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియా ముందుకు వచ్చారు. అమరావతిలో తనకెలాంటి భూములు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజధానిలో తనకు భూములున్నాయని వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా విషయాల్లో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పైనా వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News