: ప్రపంచ సంపన్నులు వీరే... ఫోర్బ్స్ తాజా జాబితా!


ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 75 బిలియన్ డాలర్ల ఆస్తితో తొలి స్థానంలో నిలువగా, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ, ఇండియాలో అత్యంత ధనవంతుడిగా (20.6 బిలియన్ డాలర్లు), ప్రపంచంలో 36వ సంపన్నుడిగా నిలిచారు. గత సంవత్సరంతో పోలిస్తే బిల్ గేట్స్ ఆస్తులు 4.2 బిలియన్ డాలర్లు తగ్గాయి. గడచిన 22 సంవత్సరాల్లో 17 ఏళ్ల పాటు బిల్ గేట్స్ 'వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్'గా నిలుస్తూ వచ్చారని ఈ సందర్భంగా ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో రెండవ స్థానంలో స్పెయిన్ బిలియనీర్, రిటైల్ జెయింట్ జారా వ్యవస్థాపకుడు అమాన్సియో ఓర్టెగా, మూడవ స్థానంలో బార్క్ షైర్ హాత్ వే సీఈఓ వారన్ బఫెట్, ఆపై మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్ హెలూ, అమేజాన్ సీఈఓ జఫ్ బేజాస్ నిలిచారు. ఇండియా నుంచి మొత్తం 84 మందికి జాబితాలో స్థానం దక్కగా, దిలీప్ సంఘ్వి (44), అజీంప్రేమ్ జీ (55), శివ్ నాడార్ (88)లు టాప్-100లో నిలిచారు. వీరితో పాటు లక్ష్మీ మిట్టల్ (135), సునీల్ మిట్టల్ (219), గౌతమ్ అదానీ (453), సావిత్రీ జిందాల్ (453), రాహుల్ బజాజ్ (722), ఎన్ఆర్ నారాయణమూర్తి (959), ఆనంద్ మహీంద్రా (1577) స్థానాల్లో ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 221 మంది జాబితా నుంచి బయటకు వెళ్లిపోగా, కొత్తగా 198 మంది వచ్చి చేరారు. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా (ఒక డాలర్ రూ. 68.75) 1. బిల్ గేట్స్ - రూ. 5.15 లక్షల కోట్లు - మైక్రోసాఫ్ట్ 2. అమాన్సియో ఓర్టెగా - రూ. 4.54 లక్షల కోట్లు - జారా 3. వారన్ బఫెట్ - రూ. 4.18 లక్షల కోట్లు - బార్క్ షైర్ హాత్ వే 4. కార్లోస్ స్లిమ్ హెలూ - రూ. 3.43 లక్షల కోట్లు - టెలికం 5. జెఫ్ బెజోస్ - రూ. 3.10 లక్షల కోట్లు - అమేజాన్ 6. మార్క్ జుకర్ బర్గ్ - రూ. 3.06 లక్షల కోట్లు - ఫేస్ బుక్ 7. లారీ ఎల్లిసన్ - రూ. 2.99 లక్షల కోట్లు - ఒరాకిల్ 8. మైఖేల్ బ్లూమ్ బర్గ్ - రూ. 2.75 లక్షల కోట్లు - బ్లూమ్ బర్గ్ 9. చార్లెస్ కోచ్ - రూ. 2.72 లక్షల కోట్లు - వివిధ విభాగాలు 10. డేవిడ్ కోచ్ - రూ. 2.72 లక్షల కోట్లు - వివిధ విభాగాలు 11. లిలియానే బెటిన్ కోర్ట్ - రూ. 2.48 లక్షల కోట్లు - లోరియల్ 12. లారీ పేజ్ - రూ. 2.42 లక్షల కోట్లు - గూగుల్ 13. సెర్గి బ్రిన్ - రూ. 2.36 లక్షల కోట్లు - గూగుల్ 14. బెర్నార్డ్ అర్నాల్ట్ - రూ. 2.33 లక్షల కోట్లు - ఎల్వీఎంహెచ్ 15. జిమ్ వాల్టన్ - రూ. 2.31 లక్షల కోట్లు - వాల్ మార్ట్ 16. అలీస్ వాల్టన్ - రూ. 2.28 లక్షల కోట్లు - వాల్ మార్ట్ 17. రాబ్సన్ వాల్టన్ - రూ. 2.19 లక్షల కోట్లు - వాల్ మార్ట్ 18. వాంగ్ జియాన్లిన్ - రూ. 1.97 లక్షల కోట్లు - రియల్ ఎస్టేట్ 19. జార్జ్ లీమన్ - రూ. 1.91 లక్షల కోట్లు - లిక్కర్ బిజినెస్ 20. లీకా షింగ్ - రూ. 1.86 లక్షల కోట్లు - వివిధ విభాగాలు వీరితో పాటు బీట్ హీస్టర్ (21- 25.9 బి. డాలర్లు), షెల్డన్ అడల్సన్ (22- 25.2 బి. డాలర్లు), జార్జ్ సారోస్ (23- 24.9 బి. డాలర్లు), ఫిల్ నైట్ (24- 24.4 బి. డాలర్లు), డేవిడ్ ధాంప్సన్ (25- 23.8 బి. డాలర్లు), స్టీవ్ బామర్ (26- 23.5 బి. డాలర్లు), ఫారెస్ట్ మార్స్ జూనియర్ (27- 23.4 బి. డాలర్లు), జాక్వలిన్ మార్స్ (28- 23.4 బి. డాలర్లు), జాన్ మార్స్ (29- 23.4 బి. డాలర్లు), మారియా ఫ్రాంకా ఫిసోలో (30- 22.1 బి. డాలర్లు)లు టాప్-30లో నిలిచారు.

  • Loading...

More Telugu News