: బాలీవుడ్ లోకి ప్రవేశించిన మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడ్నవీస్


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత బాలీవుడ్ లో కాలుమోపారు. ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'జై గంగాజల్' చిత్రంలో ఓ గీతాన్ని ఆలపించడం ద్వారా ఆమె హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ప్రకాష్ ఝా చిత్రీకరిస్తున్న ఈ సినిమా కోసం ఆమె ఓ భక్తి పాటను పాడారు. ఇందుకోసం ఆమె ఎటువంటి పారితోషికాన్నీ తీసుకోలేదని చిత్ర వర్గాలు వెల్లడించాయి. "ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. సలీమ్, సులేమాన్ స్వరపరచగా, మనోజ్ ముంతాషిర్ రాసిన పదాలు అద్భుతం. నేను ఓ పాటను రికార్డు చేసుకుంటుండగా, ప్రకాష్ ఝా చూసి, తన చిత్రంలోని పాటకు, సందర్భానికి నా గొంతు సరిపోతుందని భావించి ఈ ఆఫర్ ఇచ్చారు. ఒకటిన్నర రోజులో రికార్డింగ్ ముగిసింది" అని అమృత తెలిపారు.

  • Loading...

More Telugu News