: స్నేహితుడి ఇంట్లో కన్నడ బుల్లితెర నటి శృతి అనుమానాస్పద మృతి


కన్నడ బుల్లితెర నటి శృతి (24) తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, శృతికి 7 సంవత్సరాల క్రితం రమేష్ అనే వ్యక్తితో వివాహం కాగా, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, వీరింటికి సమీపంలోనే ఉండే శ్రీకాంత్ తో గత కొంతకాలంగా శృతి సన్నిహితంగా ఉంటోంది. సోమవారం రాత్రి శ్రీకాంత్ ఇంటికి శృతి వచ్చిన సమయంలో ఇద్దరి మధ్యా గొడవ జరుగగా, ఆపై కాసేపటికే ఆమె మరో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News