: చంద్రబాబు ఇంట్లో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ
అనుకున్నట్టుగానే కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీకి షాకిచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలో ఉన్న చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉందని వెల్లడించిన ఆయనకు బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోడుమూరు అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మణిగాంధీ కోరినట్టు తెలుస్తోంది. ఆయన వెంట పలువురు తెలుగుదేశం కార్యకర్తలు సీఎం ఇంటికి వచ్చారు. చంద్రబాబునాయుడితో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడితోనూ మణిగాంధీ చర్చలు జరిపారు.