: జీవితానికి అర్థం నాగార్జున...మా అన్నయ్య ఏం చెప్పాడో అదే చూశాను: కార్తీ


జీవితానికి కచ్చితమైన అర్థం నాగార్జున అని కార్తీ చెప్పాడు. 'ఊపిరి' ఆడియో వేడుకలో కార్తీ మాట్లాడుతూ, జీవితం అంటే బాధలు, కష్టాలు, కన్నీళ్లు కాదని అన్నాడు. జీవితం అంటే సంతోషం అని, జీవితం అంటే పండగ అని, ప్రతిక్షణం విలువైనదేనని ఎంత సంతోషంగా ఉంటే అంత బాగుంటుందని కార్తీ తెలిపాడు. ఈ సినిమాను అంగీకరించే ముందు తన అన్న సూర్య మాట్లాడుతూ, 'నువ్వు తెలుగుకు వెళ్లు, ఆ తరువాత చూడు...అక్కడ అంతులేని ప్రేమ ఉంద'ని అన్నాడని గుర్తు చేసుకున్నాడు. తన అన్న చెప్పినట్టే ఇక్కడ తనకు విశేషమైన ప్రేమాభిమానాలు లభించాయని కార్తీ చెప్పాడు. నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమా ఎన్నో మంచి అనుభూతులను పంచిందని ఆయన తెలిపాడు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని కార్తీ చెప్పాడు.

  • Loading...

More Telugu News