: నాకు మొదటి నుంచీ నచ్చిన టైటిల్ అదే: నాగార్జున
ఈ మధ్య తన పెద్ద కుమారుడు 'సాహసమే శ్వాసగా సాగిపో' అనే సినిమా చేస్తున్నాడని, తాను సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు నచ్చిన పేరు అదేనని, ఏ విషయంలోనైనా తాను అలాగే సాగిపోతానని నాగార్జున చెప్పారు. 'ఊపిరి' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, అలా సాహసమే శ్వాసగా భావించాను కనుకే 'గీతాంజలి', ఆ తరువాత 'శివ', 'అన్నమయ్య', 'రామదాసు', 'సోగ్గాడే చిన్ని నాయన' ఇలా వైవిధ్యభరితమైన కథా చిత్రాలు చేశానని అన్నారు. ఇక ఈ సినిమాలో వీల్ ఛెయిర్ లో కూర్చున్నానని, అలాగని తన పాత్రపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని నాగార్జున చెప్పారు. నవ్విస్తాం, ఏడిపిస్తాం, సంతోషపెడతాం. ఇలా ప్రతి అంశంలోనూ సినిమా ఫుల్ ప్యాకేజ్ అని ఆయన తెలిపారు. జీవితంలో ఎవరో ఒకరు తోడుంటే అన్ని కష్టాలు ఈదేస్తామని ఆయన చెప్పారు. ఈ సినిమాలో తనకు కార్తీ తోడున్నారని ఆయన చెప్పారు. కార్తీ మంచినటుడు అని ఆయన కితాబు ఇచ్చారు. ఈ సినిమా ద్వారా తనకు ఓ తమ్ముడు దొరికాడని, అతడే కార్తీ అని నాగార్జున చెప్పారు.