: రైనాను తడబడి ఒడిసి పట్టేసిన కులశేఖర


టీమిండియా టాప్ ఆర్డర్ ను కూల్చడంలో కులశేఖర శక్తిమేర ప్రయత్నిస్తున్నాడు. ఓపెనర్లు ధావన్ (1), రోహిత్ (15) లను అద్భుతమైన అవుట్ స్వింగర్లతో కులశేఖర పెవిలియన్ బాటపట్టించాడు. నిలదొక్కుకున్న రైనా (25) శనక బౌలింగ్ లో మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కు ప్రయత్నించాడు. మిడ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కులశేఖర ముందుకు పరుగెట్టి బంతిని అందుకున్నాడు. చేతుల్లో పడిన బంతి పైకి ఎగిరిపోయింది. మళ్లీ దానిని కిందపడకుండా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికీ అది చేతుల్లో పడి జారిపోయింది. మళ్లీ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించిన కులశేఖర ఈసారి మాత్రం తడబడలేదు. దీంతో మూడో వికెట్ 70 పరుగుల వద్ద పడిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వస్తూనే ఫోర్ బాదిన యువీ, హెరాత్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో టీమిండియా 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. కోహ్లీ (33), యువరాజ్ (18) క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 46 పరుగులు కావాల్సిఉంది.

  • Loading...

More Telugu News