: బస్సులో 'బుస్సు'...భయాందోళనల్లో ప్రయాణికులు!


తాము ప్రయాణిస్తున్న బస్సులో ఒక నాగుపాము కూడా ఉందన్న విషయం తెలుసుకున్న ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడినపాట్లు అన్నీఇన్నీ కావు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మార్కెట్ యార్డు వద్ద ఈ రోజు జరిగింది. బోయకొండ నుంచి కర్ణాటకకు బస్సు వెళుతోంది. కొద్దిసేపయిన తర్వాత బస్సులో నాగుపాము ఉండటాన్ని ప్రయాణికులు గమనించారు. దీంతో బస్సు ఆపమని డ్రైవర్ కి చెప్పారు. అతను ఆపడంతోనే, బతుకు జీవుడా అంటూ.. ప్రాణాలతో ప్రయాణికులు బయటపడ్డారు.

  • Loading...

More Telugu News