: కొట్టుకున్న కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన టీడీపీ!
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం సందర్భంగా టీడీపీ పరువును గంగలో కలిపిన కౌన్సిలర్లను సస్పెండ్ చేసినట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఖద్దూస్ ప్రకటించారు. నిన్న సమావేశ మందిరంలోనే కౌన్సిలర్లు త్రిమూర్తులు, రమేష్ పిడిగుద్దులు కురిపించుకుని, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ పరువును బజారుకీడ్చారంటూ మండిపడింది. తక్షణం వారిని పార్టీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు.