: ఈ సూత్రం ఫాలో అయిపోతే భార్యతో వివాదాలుండవు: అక్షయ్ కుమార్
ప్రతి ఒక్కరి సంసారంలోనూ చిన్నాచితకా సమస్యలు వస్తూవుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య కాలంలో చిన్నచిన్న సమస్యలకే పలువురు విడాకులు తీసుకుంటూ వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం పెరిగిపోతోంది. అలాంటి వారికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓ సూత్రం ఫాలో అయిపోవాలని సూచిస్తున్నాడు. అదేంటంటే, భార్య మాటకు అడ్డు చెప్పకూడదట! తాను ఇదే ఫాలో అవుతానని చెప్పాడు. తన భార్యకు పుస్తకాలు చదవడం, రాయడం పట్ల ఆసక్తి ఉంటే, తాను కేవలం స్క్రిప్టులు, అగ్రిమెంట్లు తప్ప ఇంకేం చదవనని అన్నాడు. ఇంత వైరుధ్యమున్నప్పటికీ తమ సంసార జీవితం ఆనందంగా సాగిపోవడానికి కారణం ఒకటేనని చెప్పాడు. ఆమె ఏం చెబితే అది చేస్తానని, ఆమె చెప్పింది సావధానంగా వింటానని, తనకేం కావాలో అది అందిస్తానని అక్షయ్ పేర్కొన్నాడు. తాను ఇలా ఉండబట్టే తమ సంసారం హ్యాపీగా ఉందన్నాడు. పైపెచ్చు, అందరూ ఇది పాటిస్తే హ్యాపీ అంటున్నాడు.