: జేఎన్యూ ఎఫెక్ట్... 'దేశద్రోహ' చట్టానికి త్వరలో సవరణ!


జేఎన్యూలో విద్యార్థులపై దేశద్రోహం ఆరోపణలు, ఆపై కొనసాగుతున్న నిరసనలతో ఏర్పడ్డ నష్ట నివారణకు మోదీ సర్కారు నడుం బిగించింది. భారత శిక్ష్మాస్మృతిలో దేశద్రోహాన్ని నిర్వచిస్తున్న 'సెక్షన్ 124ఏ'ను సవరించే ప్రయత్నాల్లో ఉన్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేడు పార్లమెంటుకు తెలిపింది. న్యాయ కమిషన్ ఈ దిశగా సమీక్ష జరుపుతోందని స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని ఎలా వాడుతున్నారో పరిశీలించాలని కమిషన్ ను కోరినట్టు వెల్లడించింది. కాగా, ఈ సెక్షన్ లో కొన్ని లొసుగులు ఉన్నాయని, వాటిని సవరించాలని ఇప్పటికే పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. వర్శిటీ విద్యార్థి కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై తన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News