: జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను: ఎమ్మెల్యే గోపిరెడ్డి
జీవితాంతం వైఎస్ జగన్ వెంటే ఉంటానని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగనేనని...పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బడ్జెట్ లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయిస్తే దీని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని గోపిరెడ్డి ప్రశ్నించారు.