: ‘ఆస్కార్’ను రెస్టారెంటులో మర్చిపోయిన డికాప్రియో!


లియోనార్డో డికాప్రియో తన ఆస్కార్ అవార్డును హాలీవుడ్ లోని ఒక రెస్టారెంట్ లో మర్చిపోయాడు. ఈ విషయాన్ని టిఎంజెడ్.కామ్ అనే వెబ్ సైట్ వెల్లడించింది. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేసింది. ‘రెవనంట్’ లో నటనకు గాను ఆస్కార్ అవార్డును పొందిన డికాప్రియో తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. డికాప్రియో మద్యం తాగడమే కాకుండా ఈ-సిగార్ ను తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అనంతరం చిన్నగా బయటకు వచ్చి కారు ఎక్కిన డికాప్రియో తన పురస్కారాన్ని రెస్టారెంట్ లోనే వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రెస్టారెంట్ లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మందు బాటిల్ ని, మరో వ్యక్తి ఆస్కార్ పురస్కారాన్ని ఆయనకు అందించినట్లు టీఎంజెడ్.కామ్ వెల్లడించింది. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News