: మూడేళ్లలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి... తిరుగులేని విజయమే లక్ష్యమంటున్న చంద్రబాబు
మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడే కార్యరంగం సిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడలో నేటి ఉదయం ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా ప్రసంగించిన ఆయన రానున్న ఎన్నికల్లో తిరుగులేని విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు తనను వరుసగా ఏడుసార్లు గెలిపించారని చెప్పిన చంద్రబాబు... రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కుప్పం మాదిరిగా తీర్చిదిద్దాలని పార్టీ నేతలకు చెప్పారు. మరో మూడేళ్లలో ప్రజా క్షేత్రంలోకి వెళ్లాల్సి ఉందని చెప్పిన చంద్రబాబు... ఆ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాల్సిందేనని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకోసం కుప్పం తరహా పరిణామ క్రమం అవసరమని ఆయన చెప్పారు.