: అమ్మతో ఇక కటీఫ్... నా బతుకు నాదే: నటి స్వాతి రెడ్డి
తనకిక ఎంతమాత్రమూ తల్లితో కలసి ఉండటం ఇష్టం లేదని సినీ నటి, ఇటీవల ప్రేమ కథ, కిడ్నాప్ డ్రామాల మధ్య ఇరుక్కుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్వాతి రెడ్డి స్పష్టం చేసింది. తల్లి తొందరపాటుతో తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని వ్యాఖ్యానించిన ఆమె, తన తండ్రి మరణంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆయన హార్ట్ ఎటాక్ కారణంగానే మరణించారని చెప్పింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి వివాదాలూ రాకుండా చూసుకునేందుకు తన బతుకేదో తానే బతకాలని నిర్ణయించుకున్నానని, తల్లికి దూరంగా బతుకుతానని అంటోంది. మూడు రోజుల క్రితం స్వాతి తల్లి నాగేంద్రమ్మ, తన కుమార్తెను కిడ్నాప్ చేశారని, బంగారాన్ని, డబ్బును దొంగిలించారని ఫిర్యాదు చేయగా, అంతా ఒట్టిదేనని తేల్చిన పోలీసులు తల్లీ కూతుళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.